రిటైర్మెంట్‌పై Sania Mirza న్యూ అప్‌డేట్

by Rajesh |
రిటైర్మెంట్‌పై Sania Mirza  న్యూ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన రిటైర్మంట్‌పై కొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 36 ఏళ్ల సానియా ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో కజకిస్థాన్ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి మహిళల డబుల్స్ ఆడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్ స్లామ్ కానుంది. ఆ టోర్నీ ముగిసాక దుబాయ్‌లో కెరీర్ చివరి టోర్నీలో సానియా ఆడనుంది. ఇంతుకుముందు యూఎస్ ఓపెన్ ఆడి కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనుకున్న సానియాకు గాయం అడ్డంకిగా మారింది. అయితే గతేడాది ఆట నుంచి తప్పుకోవాలని భావించిన సానియా ఆ తర్వాత తన మనసు మార్చుకున్న విషయం తెలిసిందే. గాయంతో కెరీర్‌ను ముగించాలనుకోలేదని అందుకే ప్రాక్టీస్ చేసి మళ్లీ మైదానంలోకి దిగుతున్నానని సానియా తెలిపింది.

Read More...

INDvsSL: నేడే నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్

Next Story

Most Viewed