- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షోయబ్ మాలిక్ సంచలన నిర్ణయం..మూడో భార్యకూ విడాకులు?
సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి, సనా జావెద్ ను వివాహం చేసుకున్నాడు మాలిక్. ఇక ఇప్పుడు విడాకులు ఇవ్వనున్నారట

దిశ, వెబ్ డెస్క్: పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ ( Shoaib Malik ) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా షోయబ్ మాలిక్, సనా జావెద్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూకు మాలిక్, సనా జావెద్ ఇద్దరూ వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. ఆ సమయంలో.. మాలిక్ అంటే అస్సలు ఇష్టం లేనట్లుగా సనా జావెద్ వ్యవహరించారట. ముఖం తిప్పుకుంటూ, సీరియస్ గా ప్రవర్తించారట సనా. దీంతో మాలిక్, సనా ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయ్యారని పాక్ తో పాటు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2024 లో మొదట్లో సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి, సనా జావెద్ ను వివాహం చేసుకున్నాడు మాలిక్. ఇక ఇప్పుడు విడాకులు ఇవ్వనున్నారట. ఇదే నిజమైతే, ముచ్చటగా మూడోసారి మాలిక్ విడాకులు ఇచ్చినట్లు అవుతుంది. కాగా సనా జావెద్... పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి. సానియా మీర్జాకు విడాకులు ఇవ్వకముందే, సనాతో ప్రేమాయాణం నడిపాడు మాలిక్. ఆ తర్వాత, సానియాకు విడాకులు ఇచ్చి, సనాను పెళ్లి చేసుకున్నాడు. ఇక అంతకు ముందు తన మొదటి భార్య అయేషాకు విడాకులు ఇచ్చాడు మాలిక్. మరి ఇప్పుడు మూడో భార్యకు నిజంగానే విడాకులు ఇస్తాడా ? లేక ఆమెతో సర్దుకుపోతాడా ? అనేది చూడాలి. క్లిక్






