- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : మార్చి నెలకు సంబంధించి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కోసం భారత క్రికెటర్లు సంజూ శాంసన్, జస్ప్రిత్ బుమ్రా పోటీపడుతున్నారు. వీరితోపాటు సౌతాఫ్రికా ప్లేయర్ కానర్ ఎస్టర్‌హుయిజన్ కూడా రేసులో ఉన్నాడు. అవార్డు నామినీలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. భారత జట్టు వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ గెలవడంలో శాంసన్, బుమ్రా కీలక పాత్ర పోషించారు. అందుకే వారు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. శాంసన్ అయితే కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మార్చిలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్‌లో 97, సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 89, న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో 89 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో కలిపి 275 రన్స్ చేశాడు.
మరోవైపు, అవే మ్యాచ్‌ల్లో బుమ్రా కూడా రాణించాడు. విండీస్‌పై 2 వికెట్లు తీశాడు. ఇక, ఇంగ్లాండ్‌తో గేముల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అతను 4 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి 33 రన్సే ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 16, 18 ఓవర్లలో 8, 6 పరుగులే ఇచ్చి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, కివీస్‌తో ఫైనల్‌లో 4 వికెట్లతో సత్తాచాటాడు. బుమ్రా 2024లో రెండు సార్లు మంత్లీ అవార్డు గెలిచాడు. ఈ అవార్డకు నామినేట్ అవడం శాంసన్‌కు ఇదే తొలిసారి. మరోవైపు, సౌతాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజన్ న్యూజిలాండ్‌తో అరంగేట్ర టీ20 సిరీస్‌లోనే సత్తాచాటాడు. ఐదు మ్యాచ్‌ల్లో 200 రన్స్ చేశాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్, ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ, సౌతాఫ్రికా బౌలర్ అయాబొంగా ఖాక నామినేట్ అయ్యారు.






