- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్ రాయల్స్‌కు శాంసన్ గుడ్ బై?.. మేనేజ్‌మెంట్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చిన సంజూ
రాజస్థాన్ రాయల్స్, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మధ్య విభేదాలు తలెత్తినట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మధ్య విభేదాలు తలెత్తినట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే శాంసన్ రాజస్థాన్ వీడాలని నిర్ణయించుకున్నట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. జట్టు నుంచి తనను రిలీజ్ చేయాలని మేనేజ్‌మెంట్‌ను కోరినట్టు తెలిపింది. మేనేజ్‌మెంట్ ముందు శాంసన్ రెండు ఆప్షన్లు ఇచ్చాడని, తనని ట్రేడ్ చేయాలని లేదా వేలంలోకి వదిలేయాలని రిక్వెస్ట్ చేసినట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. ‘శాంసన్, రాయల్స్ మేనేజ్‌మెంట్ మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. ఎంతగా అంటే శాంసనే తనను ట్రేడ్ చేయాలని లేదా వేలంలోకి రిలీజ్ చేయాలని అభ్యర్థించాడు. రాయల్స్‌తో కొనసాగడం ఇష్టం లేదని శాంసన్ కుటుంబ సభ్యులు బహిరంగంగానే చెబుతున్నారు. అతనికి సన్నిహితంగా ఉన్న ఐపీఎల్, అంతర్జాతీయ ప్లేయర్లు కూడా ఫ్రాంచైజీతో శాంసన్‌కు ఉన్న సంబంధం గతంలోలాగా లేదని చెబుతున్నారు. ’అని సదరు మీడయా సంస్థ తమ కథనంలో పేర్కొంది.
రాజస్థాన్ ఫ్రాంచైజీ శాంసన్ ట్రేడ్ చేస్తే అతన్ని తీసుకోవడానికి చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కాంట్రాక్ట్ ప్రకారం.. ప్లేయర్‌ను ట్రేడ్ చేయాలా లేదా వేలంలోకి వదలివేయాలా అనేది పూర్తిగా ఫ్రాంచైజీ నిర్ణయం. నవంబర్‌లో ఐపీఎల్ రిటెన్షన్ ఉండగా నిర్ణయం తీసుకోవడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ సీజన్‌లో గాయం కారణంగా శాంసన్ కేవలం 9 మ్యాచ్‌లే ఆడాడు. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. పేలవ ప్రదర్శన చేసిన జట్టు 9వ స్థానంతో సరిపెట్టింది. 2013 నుంచి రాజస్థాన్‌తో శాంసన్‌కు అనుబంధం ఉంది. 2021లో కెప్టెన్ అయిన అతను 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.






