వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన భారత షూటర్ సామ్రాట్

by Harish |

ఈజిప్ట్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు.

వరల్డ్ చాంపియన్‌గా అవతరించిన భారత షూటర్ సామ్రాట్
X

దిశ, స్పోర్ట్స్ : ఈజిప్ట్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. భారత షూటర్ సామ్రాట్ రాణా వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్‌లో సామ్రాట్ 243.7 స్కోరు చేసి విజేతగా నిలిచాడు. అదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ వరుణ్ తోమర్ కాంస్యం గెలిచాడు. 221.7 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విభాగంలో టీమ్ ఈవెంట్‌లోనూ సామ్రాట్ స్వర్ణం గెలిచాడు. సామ్రాట్, వరుణ్ తోమర్, శ్రవణ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు 1,754 స్కోరుతో విజేతగా నిలిచింది. మరోవైపు, తెలుగమ్మాయి ఇషా సింగ్ రజతం పతకం కొల్లగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను, సురుచి సింగ్‌, ఇషాలతో కూడిన భారత జట్టు 1,740 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగత ఈవెంట్‌లో ఇషా, మను వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. సోమవారం మూడు పతకాలు దక్కడంతో భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది. అందులో మూడేసి స్వర్ణాలు, రజతాలు, కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం మెడల్ టేబుల్‌లో 12 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉన్నది.


Next Story