- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Ali Agha: రాసిపెట్టుకోండి.. 2026 టీ20 వరల్డ్ కప్, 2027 వన్డే ట్రోఫీ మాదే
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్, టీ20 సారధి సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్లలో పాకిస్తాన్ టీం చాలా బ

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ స్టార్ ప్లేయర్, టీ20 సారధి సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జట్లలో పాకిస్తాన్ టీం చాలా బలమైనదని పేర్కొన్నారు. మొన్నటి ట్రై సిరీస్ లో పాక్ ఆటతీరు అద్భుతమని కొనియాడారు. ఇకపై ఇదే తరహాలోనే ఆడి, ముందుకు సాగుతామని ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ తో పాటు వన్డే వరల్డ్ కప్ 2027 ట్రోఫీని గెలుచుకుంటామని ప్రకటించారు.
కసితో ఆడితే, ఈ టోర్నమెంట్లు గెలవడం పెద్ద రిస్క్ కాదన్నారు. ఇక ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియా ఓడించేలా కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలపై ఇండియన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ తో పాటు వన్డే వరల్డ్ కప్ 2027 ట్రోఫీని కలలో కూడా పాకిస్తాన్ గెలవబోదని, గెలవనివ్వబోమని కౌంటర్ ఇస్తున్నారు ఫ్యాన్స్. సొంత గడ్డపై సిరీస్ గెలిస్తే, సరిపోదు, విదేశీ పిచ్ లపై పాకిస్తాన్ ఆడాలని చురకలు అంటిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా భారత్, పాక్ రెండు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఇందులో భాగంగా రెండు జట్ల మధ్య ఫిబ్రవరిలో కొలంబో వేదికగా మ్యాచ్ కూడా జరుగనుంది.






