పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాక్ తీరు

by Malleboina Mahesh |

భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాక్ తీరు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్ మొత్తం మ్యాచ్ ఫీజును దేశ సాయుధ దళాలకు, పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు విరాళం గా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది గమనించిన పాకిస్థాన్ జట్టు కూడా తమ మ్యాచ్ ఫీజులను “ఆపరేషన్ సిందూర్” సమయంలో ప్రభావితమైన పౌరులు, పిల్లలకు విరాళంగా ఇవ్వాలని ప్రకటించింది. దీంతో పాక్ తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఫైనల్ మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా భారత జట్టును “అగౌరవ పరిచినట్లు” విమర్శిస్తూ, ఫైనల్ తర్వాత ట్రోఫీ స్వీకరణకు నిరాకరించిన భారత జట్టుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు రెండు జట్ల మధ్య పోటీ తత్వం మాత్రమే కాదు, క్రికెట్ క్రీడలోని రాజకీయ, సామాజిక భావాల కలగలిసిన ఉద్రిక్త పరిస్థితులను నిరూపించాయి.

Next Story