బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం..భార‌త జ‌ట్టుకు కొత్త కోచ్ వ‌చ్చేశాడు

by velandi.Saikiran |

స్పిన్ బౌలింగ్ కోచ్ గా తాజాగా సాయిరాజ్ ను ఫైనల్ చేశారు.

బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం..భార‌త జ‌ట్టుకు కొత్త కోచ్ వ‌చ్చేశాడు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పైన దృష్టి పెట్టింది భారత జట్టు. ఈ క్రమంలో భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) నియామకం చేసింది. ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ఉన్నాడు. ఇటు ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ఉండగా, బ్యాటింగ్ కోచ్ గా సితాంశూ కొనసాగుతున్నాడు.

అయితే స్పిన్ బౌలింగ్ కోచ్ గా తాజాగా సాయిరాజ్ ను ఫైనల్ చేశారు. ఐపీఎల్ 2026 లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ సాయిరాజ్ పనిచేశాడు. 1997 నుంచి 2003 మధ్య భారత జట్టు తరుపున బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలోనే రెండు టెస్టులు, 8 వన్డేల్లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. 188 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన సాయిరాజ్, 630 వికెట్లు పడగొట్టడం గమనార్హం. 147 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 197 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే బీసీసీఐకి ఇతనికి అవకాశం ఇచ్చింది.

Next Story