వ‌రుస‌గా పాక్ ప్లేయ‌ర్ డ‌కౌట్‌..Audi Cars బ్రాండ్ అంబాసిడర్ ప్ర‌మోష‌న్ !

by velandi.Saikiran |

ఆడి కార్ బ్రాండ్ అంబాసిడర్... అయ్యాడని సైమ్ అయూబ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడి కార్ సింబల్ లో... నాలుగు

వ‌రుస‌గా పాక్ ప్లేయ‌ర్ డ‌కౌట్‌..Audi Cars బ్రాండ్ అంబాసిడర్ ప్ర‌మోష‌న్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ దశ దాదాపు ముగిసింది. పాకిస్తాన్ అలాగే టీమిండియా రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరగనుంది. అయితే నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చివరి క్షణం వరకు పోరాడి పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో ఫైనల్ కు రాగలిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... పాకిస్తాన్ క్రికెటర్ సైమ్ అయూబ్ (Saim Ayub) పైన దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

దానికి ముఖ్య కారణం ఆయన... డకౌట్స్ కావడమే. ఆసియా కప్ 2025 టోర్నమెంటు ప్రారంభాని కంటే ముందు.... బుమ్రా బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొడతానని... విర్రవిగాడు. కానీ టీమిండియా పై ఇప్పటివరకు ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. అదే సమయంలో మిగిలిన జట్ల చేతిలో కూడా... దారుణంగా విఫలమై డక్ అవుట్ అయ్యాడు సైమ్ అయూబ్. ఈ ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లలో డక్ అవుట్ కావడం విశేషం. దీంతో.. ఆడి కార్ బ్రాండ్ అంబాసిడర్... అయ్యాడని సైమ్ అయూబ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడి కార్ సింబల్ లో... నాలుగు సున్నాలు కనిపిస్తాయి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇతను కూడా నాలుగు సార్లు డక్ అవుట్ అయ్యాడని... సైమ్ అయూబ్ ను ఆడుకుంటున్నారు.

Next Story