IND VS ENG: కరుణ్ నాయర్ పై వేటు.. 23 ఏళ్ళ కుర్రాడు వస్తున్నాడు

by velandi.Saikiran |   (  Updated:2025-07-15 12:40:36  IST  )

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే

IND VS ENG: కరుణ్ నాయర్ పై వేటు.. 23 ఏళ్ళ కుర్రాడు వస్తున్నాడు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ లు గెలిచిన ఇంగ్లాండ్ ముందంజలో ఉంది. అటు టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఈనెల 23వ తేదీ నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మంచెస్టర్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. మూడో టెస్ట్ తరహాలోనే.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో టీమిండియా రానుంది.. అయితే బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఓ కీలక మార్పు చేసేందుకు సన్నద్ధమవుతోంది. కరుణ్ నాయర్ (karun nair) ను నాలుగో టెస్ట్ నుంచి తొలగించి... 23 ఏళ్ల కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్ ను (sai sudharsan) తిరిగి జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వరుసగా మూడు టెస్టుల్లో కరుణ్ నాయర్ కు టీమిండియా యాజమాన్యం అవకాశం.. ఇచ్చింది. సాయి సుదర్శన్ ను పక్కకు పెట్టి మరి... కరుణ్ కు అవకాశం ఇచ్చారు. మూడు టెస్టుల్లో మొత్తం 131 పరుగులు మాత్రమే చేశాడు కరుణ్ నాయర్. ఇక ఇప్పటికైనా అతన్ని తొలగించి సాయి సుదర్శన్ ను నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఆడించాలని డిసైడ్ అయింది టీమిండియా యాజమాన్యం. అలాగే రిషబ్ పంత్ గాయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Next Story