భారత క్రికెట్‌లో సుదర్శనే నెక్ట్స్ సూపర్ స్టార్.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

by Harish |

టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసలు కురిపించాడు.

భారత క్రికెట్‌లో సుదర్శనే నెక్ట్స్ సూపర్ స్టార్.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్‌లో నెక్ట్స్ సూపర్ స్టార్ అతననే జోస్యం చెప్పాడు. సుదర్శన్ మరో విరాట్ కోహ్లీ అవుతాడని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంటీ పనేసర్ మాట్లాడుతూ..‘ప్రస్తుత భారత జట్టులో అద్భుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ప్లేయర్. దూకుడుగా, నిర్భయంగా ఆడతాడు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో సర్రే తరపున సాయి సుదర్శన్ బాగా ఆడాడు. భారత క్రికెట్‌లో తర్వాతి సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు. 4వ స్థానంలో కోహ్లీ పోషించిన పాత్రను అతను పోషించగలడు.’అని చెప్పుకొచ్చాడు. ఇటీవల తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ తరపున సుదర్శన్ అదరగొట్టాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 759 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.


Next Story