Asia Cup 2023: సమర విక్రమ సెంచరీ మిస్.. భారీ స్కోరు చేసిన శ్రీలంక..

by Disha Web Desk 13 |
Asia Cup 2023: సమర విక్రమ సెంచరీ మిస్.. భారీ స్కోరు చేసిన శ్రీలంక..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 257 పరుగుల స్కోరు చేసింది.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ హాఫ్ సెంచరీలతో రాణించి.. లంకకు భారీ స్కోరు అందించారు. సధీర సమరవిక్రమ 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో 4, 6 బాదిన సమరవిక్రమ, చివరి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. నిశ్శంక, కుసాల్ మెండిస్ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 73 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన కుసాల్ మెండిల్ కూడా షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్‌, హసన్ చెరో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు పడగొట్టారు.

Next Story