సచిన్ 100 సెంచరీల రికార్డు: కోహ్లిపై హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 4 |
సచిన్ 100 సెంచరీల రికార్డు: కోహ్లిపై హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే తాజాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 40 నెలల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో 186 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. 34 ఏళ్ల కోహ్లి 24 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడని తెలిపాడు. వంద సెంచరీల కన్నా ఎక్కువ సెంచరీలు కోహ్లి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫిట్ నెస్, ఏజ్ కోహ్లికి ప్లస్ పాయింట్లని భజ్జీ అన్నాడు. విరాట్ ఇప్పటికే 75 సెంచరీలు బాదాడని, ఇంకా 50 కంటే ఎక్కువ సెంచరీలు చేస్తాడన్నాడు. వంద సెంచరీల రికార్డును కేవలం కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడన్నాడు. మిగిలిన వారంతా అతని వెనకే ఉన్నారన్నారు.

Next Story