రిచెస్ట్ క్రికెటర్‌గా స‌చిన్‌ రికార్డ్‌..ఆయ‌న ఆస్తులు ఆస్తి ఎంతో తెలుసా?

by velandi.Saikiran |   (  Updated:2026-04-24 09:15:36  IST  )

ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ గా కూడా కొనసాగుతున్నాడు స‌చిన్‌.

రిచెస్ట్ క్రికెటర్‌గా స‌చిన్‌ రికార్డ్‌..ఆయ‌న ఆస్తులు ఆస్తి ఎంతో తెలుసా?
X

దిశ‌, వెబ్ డెస్క్: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చిన లిటిల్ మాస్టర్ సచిన్.. ఎన్నో అఖండ విజయాలను అందించాడు. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ 53వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా వేలాది అభిమానులు, క్రికెటర్లు.. సచిన్ టెండూల్కర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆయన ఇంటి బయట ఫ్యాన్స్ కోరిక మేరకు.. కేక్ కూడా కట్ చేశాడు సచిన్.

సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లు అంటే

క్రికెట్ అంటేనే సచిన్ టెండుల్కర్ గుర్తుకు వస్తాడు. అంతలా క్రికెట్ లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నారు సచిన్. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ సంపదలోనూ ఏ మాత్రం తగ్గలేదు. సంపాదనలో ఇత‌ర ఇండియన్ క్రికెటర్ల కంటే ఒక మెట్టు ఎత్తులోనే ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ గా కూడా కొనసాగుతున్నాడు.

సచిన్ టెండూల్కర్ సంపాదన రూ.1410 కోట్లుగా ఉంది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని రూ. 1040 కోట్లు కాగా విరాట్ కోహ్లీ ఆస్తులు రూ.1010 కోట్లు మాత్రమే. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, పెట్టుబడులు స్థిరాస్తుల ఆదాయంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు మెంటార్ గా ఉంటూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు సచిన్ టెండుల్కర్. ఇలా అందరికంటే ఎక్కువగా డబ్బులు సంపాదించి రిచెస్ట్ క్రికెటర్ గా మారిపోయాడు.

Next Story