పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు సచిన్‌ పెప్ టాక్

by Phanindra |

పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు అండర్-19 ప్లేయర్లకు సచిన్‌ పెప్ టాక్ ఇచ్చాడు.

పాక్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు సచిన్‌ పెప్ టాక్
X

దిశ, స్పోర్ట్స్: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఢీకొట్టేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. కొన్నిరోజుల క్రితం అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువభారత జట్టుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పెప్ టాక్ ఇచ్చాడు. వీడియో కాల్‌లో కుర్రప్లేయర్లతో ముచ్చటించిన సచిన్.. ఒత్తిడిని ఎలా అధిగమించాలో చిట్కాలు చెప్పాడు. ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి కుర్రాళ్లు సచిన్ మాటలను చాలా శ్రద్ధగా విన్నారు. సచిన్‌తో ఈ ఇంటరాక్షన్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘కేవలం ఫిట్‌నెస్, టెక్నికల్ స్కిల్స్ గురించే కాకుండా.. ఎప్పటికప్పుడు మారే ఆటలో సుదీర్ఘకాలం కొనసాగాలంటే ఎలాంటి ఫోకస్ ఉండాలి? వంటి అంశాలను సచిన్ తన విలువైన అనుభవాలను కుర్రాళ్లతో పంచుకున్నారు’ అంటూ బీసీసీఐ వెల్లడించింది.

Next Story