- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు - సచిన్
అర్జున్ టెండూల్కర్, సానియా పెళ్లిపై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: అర్జున్ టెండూల్కర్ వివాహంపై సచిన్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చాలా పెద్దవాడు అయ్యాడని.. అతనికి నచ్చిన అమ్మాయి తో పెళ్లి చేయబోతున్నట్లు ప్రకటించారు. నా కొడుకు ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన నేపథ్యంలోనే పెళ్లికి ఒప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్, సానియా చందోక్ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మార్చి ఐదవ తేదీన అర్జున్ టెండూల్కర్, సానియా పెళ్లి జరగనుంది. ఈ మేరకు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉంది.
అర్జున్-సానియా పెళ్లిపై సచిన్ టెండూల్కర్ ఎమోషనల్
వచ్చేవారమే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా పెళ్లి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు ఒక అమ్మాయిని ఇంటికి పరిచయం చేసినప్పుడే.. అతడు పెద్దవాడయ్యాడని తనకు అర్ధమైనట్లు వెల్లడించారు. వారిద్దరూ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. అర్జున్ తనకి ఇష్టమైన తోడును వెతుక్కున్నందుకు గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యారు సచిన్. తాను కూడా ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు. అర్జున్ టెండూల్కర్, సానియా కలిసిమెలిసి నిండు నూరేళ్లు ఉండాలని కోరారు. కాగా అర్జున్ టెండూల్కర్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సానియా, ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు కావడం గమనార్హం.






