ODI WC 2027: టీమిండియా వన్డే కెప్టెన్ గా రుతురాజ్..?

by velandi.Saikiran |   (  Updated:2025-08-16 07:34:32  IST  )

2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు... రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే... వెంటనే రుతురాజుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వ

ODI WC 2027: టీమిండియా వన్డే కెప్టెన్ గా రుతురాజ్..?
X

దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ ( Rohit Sharma)... టి20 లు అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రోహిత్ శర్మ. 2027 వరల్డ్ కప్ ఆడిన తర్వాత రిటర్మెంట్ ప్రకటించాలని.. ఓ ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అంతకంటే ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొంతమంది అంటున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో ఎస్ బద్రీనాథ్ ( S Badrinath ) కీలక ప్రకటన చేశారు. అనివార్య కారణాలవల్ల 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు... రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే... వెంటనే రుతురాజుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇస్తే టీమిండియా కచ్చితంగా ఛాంపియన్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరినీ కలిపితే రుతురాజ్ అంటూ సపోర్ట్ గా నిలిచారు బద్రీనాథ్.

దీంతో బద్రీనాథ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లోనే... రుతురాజు గైక్వాడ్ ( Ruturaj Gaikwad) స్థానం కష్టమే అని అంటున్నారు. అలాంటిది వన్డే కెప్టెన్ గా ప్రకటిస్తారనేది ఉత్తమటే అంటూ మరికొంతమంది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి అప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మొన్నటి వరకు రుతురాజు కెప్టెన్ గా వ్యవహరించారు.

Asia Cup 2025: రింకూ, అయ్యర్ లేకుండానే...ఆసియా కప్ ఆడనున్న టీమిండియా !

Next Story