Asia Cup 2025: రింకూ, అయ్యర్ లేకుండానే...ఆసియా కప్ ఆడనున్న టీమిండియా !

by velandi.Saikiran |   (  Updated:2025-08-16 05:44:15  IST  )

శ్రేయస్ అయ్యర్ తోపాటు రింకూ సింగ్ ను కూడా పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్ బాల్ పైన ఫోకస్ పెట్టుకోవాలని

Asia Cup 2025: రింకూ, అయ్యర్ లేకుండానే...ఆసియా కప్ ఆడనున్న టీమిండియా !
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియాను ప్రకటించేందుకు... భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నద్ధమవుతోంది. ఈనెల 19వ తేదీన టీమిండియాను బీసీసీఐ పాలకమండలి ప్రకటించబోతోంది.

ఇలాంటి నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లను దూరం పెట్టాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఈ లిస్టులో శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అతనితోపాటు రింకూ సింగ్ ను కూడా పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్ బాల్ పైన ఫోకస్ పెట్టుకోవాలని యశస్వి జైస్వాల్ కు సూచనలు చేశారట. అంటే ఈ ముగ్గురు కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

ఒకవేళ ఇదే నిజమైతే కచ్చితంగా టీమిండియా కు ఎదురు దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో బాగా రాణిస్తాడు. అతడు ఉంటే కచ్చితంగా టీం ఇండియా గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇటు హిట్టర్ గా రింకూ సింగ్ బాగా పనికి వస్తాడు. కానీ బీసీసీఐ మాత్రం అలా ఆలోచన చేయడం లేదట. అతని ప్లేస్ లో... జితేష్ శర్మను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇతనైతే కీపర్ గా కూడా పనికి వస్తాడని బీసీసీఐ ఆలోచన చేస్తోందట.

Next Story