కౌంటీ క్రికెట్ ఆడనున్న రుతురాజ్.. ఆ క్లబ్‌తో ఒప్పందం?

by Phanindra |

కౌంటీ క్రికెట్ ఆడేందుకు రుతురాజ్ గైక్వాడ్ రెడీ అవుతున్నాడు. ఇంగ్లండ్‌లోని పాపులర్ కౌంటీ క్లబ్‌తో డీల్ చేసుకున్నాడట.

కౌంటీ క్రికెట్ ఆడనున్న రుతురాజ్.. ఆ క్లబ్‌తో ఒప్పందం?
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్‌స్టర్ రుతురాజ్ గైక్వాడ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. యార్క్‌షైర్‌ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్‌లో ఐదు మ్యాచులు, వన్ డే కప్ టోర్నీ ఆడేందుకు గైక్వాడ్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఇండియా-ఎ జట్టులో ఉన్న రుతు.. జూన్ 13-16న జరిగే ఇంట్రా-స్క్వాడ్ మ్యాచులో సీనియర్ ప్లేయర్ల టీంతో ఆడతాడు. ఆ తర్వాత అతను తమ టీంతో చేరనున్నాడని యార్క్‌షైర్ ప్రకటించింది. ఈ క్లబ్‌లో చేరడంపై తన ఆసక్తిని వెల్లడించిన రుతు.. ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడాలనేది ఎప్పటినుంచో తన లక్ష్యమని, అలాగే ఇక్కడ యార్క్‌షైర్ కన్నా పెద్ద క్లబ్ మరొకటి లేదని అన్నాడు.

Next Story