తొలి వ‌న్డేలో అట్ట‌ర్ ఫ్లాఫ్‌..రుతురాజ్ పై ధోని సీరియ‌స్‌

by velandi.Saikiran |

రుతురాజుపై మహేంద్ర సింగ్ ధోని కూడా సీరియస్ అయినట్లు పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది రుతురా

తొలి వ‌న్డేలో అట్ట‌ర్ ఫ్లాఫ్‌..రుతురాజ్ పై ధోని సీరియ‌స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో స్థానం దక్కించుకున్న యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ పైన ( Ruturaj Gaikwad) సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై అభిమానులే అతన్ని టార్గెట్ చేసి, పోస్టులు పెడుతున్నారు. దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి వన్డేలో అవకాశం దక్కినప్పటికీ, రుతురాజ్ గైక్వాడ్ అట్టర్ ఫ్లాప్ కావడాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు.

ధోని శిష్యుడిగా పేరుగాంచిన నువ్వు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నావ్ ? అంటూ రుతురాజ్ గైక్వాడ్ ను నిలదీస్తున్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికా జట్టుపై ఎనిమిది పరుగులకే వెనుతిరిగిన రుతురాజుపై మహేంద్ర సింగ్ ధోని కూడా సీరియస్ అయినట్లు పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది రుతురాజ్ గైక్వాడ్ ను మహేంద్రసింగ్ ధోని బండ బూతులు తిట్టినట్లు మీమ్స్‌ కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకున్నావ్..? ఇక నీకు మరో రెండు వన్డేలు మాత్రమే ఉన్నాయి.. అందులో ఛాన్స్ వస్తే, కచ్చితంగా నిరూపించుకో అంటూ రుతురాజ్ గైక్వాడ్ కు మహేంద్ర సింగ్ ధోని క్లాస్ పీకినట్లు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా జార్ఖండ్ లోని రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్ ఆడి 349 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలోనే 8 వికెట్లు కూడా కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా రోహిత్ శర్మ 57 పరుగులతో రాణించాడు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించింది. చివరి ఓవర్ వరకు పోరాడిన దక్షిణాఫ్రికా, 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ లో 14 బంతుల్లో 8 ప‌రుగులు చేసి, ఔట్ అయ్యాడు రుతురాజ్‌. క్లిక్


Next Story