భార‌త్ -పాక్ మ్యాచ్ ర‌ద్దు..ఎన్ని కోట్ల న‌ష్టం అంటే ?

by velandi.Saikiran |

ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు అయితే చాలానే నష్టం జరిగే ప్రమాదముంది.

భార‌త్ -పాక్ మ్యాచ్ ర‌ద్దు..ఎన్ని కోట్ల న‌ష్టం అంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఆడుతూనే, ఇండియాతో జరిగే మ్యాచ్ ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇండియాకు చాలా లాభమే జరగనుంది. ఈ మ్యాచ్ ను బాయ్ కాట్‌ చేసింది పాకిస్తాన్ కాబట్టి, ఇండియాకు రెండు పాయింట్లు దక్కుతాయి. దాని వల్ల సులభంగా ఈ టోర్నమెంట్లో మరింత ముందుకు దూసుకు వెళ్తుంది ఇండియా.

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే ఎంత నష్టం ?

ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు అయితే చాలానే నష్టం జరిగే ప్రమాదముంది. దాదాపు రూ.4500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. డిజిటల్, టీవీ, టికెట్లు, ఇలా అనేక రూపాల్లో ఈ నష్టం జరుగుతుందట. భార‌త్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, 10 సెకండ్ల స్లాట్ అడ్వర్టైజ్మెంట్ కు దాదాపు రూ.25 నుంచి రూ.40 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. అంటే ఈ ఒక్క టీ20 మ్యాచ్ జరిగితే, ప్రకటనల ద్వారా రూ.300 కోట్ల వ‌ర‌కు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రద్దయితే అదే స్థాయిలో నష్టం కూడా ఉంటుంది అంటున్నారు క్రీడా విశేషకులు.

అటు బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు రూ.400 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ద్వారా వసూలు చేసే హక్కు ఐసీసీకి ఉంటుందని చెబుతున్నారు. రూల్స్ ప్రకారం ముందుగా చేసుకున్న‌ ఒప్పందంలో ఈ అంశం ఉంటుందట. ఎలాంటి కారణం లేకుండా మ్యాచ్ ఆడకుండా తప్పుకుంటే, ఆయా జట్లు నష్టాన్ని భరించాల్సి ఉంటుందని ఐసీసీ రూల్స్ చెబుతున్నాయి. ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారీ స్థాయిలో నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.


Next Story