- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RR vs MI : ముంబై పరుగుల వరద.. RR టార్గెట్ ఎంతంటే?
ముంబై బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

దిశ, వెబ్ డెస్క్ : ముంబై బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రికెల్ టన్, రోహిత్ లు భారీగా పరుగులు చేయడంతో ఆ జట్టు వేగంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఐపీఎల్(IPL) లో భాగంగా నేడు రాజస్తాన్, ముంబై(RR vs MI) జట్ల మధ్య మ్యాచ్ జజరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు సాధించింది. రికెల్ టన్ (61), రోహిత్ (53), సూర్యకుమార్ యాదవ్ (48), హర్ధిక్ పాండ్య (48) పరుగుల అద్భుత ప్రదర్శన చేశారు. ఇక రాజస్తాన్ బౌలర్స్ లో తీక్షణ, పరాగ్ తలా ఒక వికెట్ తీశారు.
218 పరుగుల భారీ లక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగబోతోంది. అయితే కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ అత్యద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో 35 బాల్స్ కె సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ మళ్ళీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనున్నాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






