RR Vs LSG: ఉతికారేసిన లక్నో ఓపెనర్లు.. 9 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-19 15:10:12  IST  )

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు.

RR Vs LSG: ఉతికారేసిన లక్నో ఓపెనర్లు.. 9 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 ఎడిషన్‌లో భాగంగా జైపూర్‌ (Jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయిల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణయానికి లక్నో ఓపెనర్లు చుక్కలు చూపిస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో జట్టు కేవలం 9 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) క్రీజులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మరోవైపు ప్రమాదకర బ్యాటర్ నికోలస్ పూరన్ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 13 పరుగులు చేసి మార్ష్‌కు సహకరిస్తున్నాడు. ఇక మరో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ (Josh Inglis) 29 బంతుల్లో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుత రన్ రేట్ చూస్తే లక్నో 200లకు పైగా స్కోరు సాధించేలా కనిపిస్తోంది.

పేలవంగా రాజస్థాన్ బౌలింగ్..

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను లక్నో బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు యష్ పుంజాకు మాత్రమే ఒకే ఒక్క వికెట్ దక్కింది. సుశాంత్ మిశ్రా, యష్ పుంజాలు చెరో 2 ఓవర్లు వేసి 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేయకపోతే హోమ్ గ్రౌండ్‌లో రాజస్థాన్‌కు కష్టాలు తప్పవని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Next Story