- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుమ్ములేపిన కోహ్లీ... పంజాబ్ ను చిత్తు చేసిన RCB
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( PBKS) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొన్నటి వరకు పెద్దగా ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ ( Virat Kohli) కూడా రెచ్చిపోయి ఆడి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.
ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఫిలిప్ సాల్ట్ ( Salt ) ఒక పరుగు చేసి నిరాశపరచగా... ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అలాగే పడిక్కల్ అద్భుతంగా రాణించారు. పడిక్కల్ ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన ఇతను... 174 స్ట్రైక్ రేటుతో రఫ్పాడించాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ 12 పరుగులు చేశాడు. చివరలో జితేష్ శర్మ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఇక కోహ్లీ ఈ మ్యాచ్ లో 54 బంతులల్లో 73 పరుగులు చేసాడు. దీంతో పంజాబ్ కింగ్స్ పైన ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో... వరుసగా ఓడిపోతున్నప్పటికీ... ప్రత్యర్థి గ్రౌండ్ లో మాత్రం దుమ్ము లేపుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.






