జితేష్ తాండవం.... RCB భారీ విజయం

by velandi.Saikiran |   (  Updated:2025-05-27 18:25:22  IST  )

ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

జితేష్ తాండవం.... RCB భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. లక్నో జట్టుపై ( LSG) మంగళవారం రోజున 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించి బెంగుళూరు టాప్ 2 లోకి దూసుకు వెళ్ళింది.

మంగళవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు అవలీలగా ఛేదించింది. కేవలం 18.4 ఓవర్స్ లోనే.. నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేయగా.. జితేష్ శర్మ దుమ్ము లేపాడు. తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న జితేష్ శర్మ... ఈ మ్యాచ్ లో 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు.

ఇందులో ఆరు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. జితేష్ శర్మతో పాటు అగర్వాల్ 41 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో... పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో క్వాలిఫైయర్ 1 లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ మ్యాచ్ మే 29వ తేదీన చండీఘర్ వేదికగా జరగనుంది.

Next Story