- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2026: ఆర్సీబీ మరో విజయం.. పాయింట్ల పట్టిక వివరాలు ఇవే
WPL 2026 భాగంగా ఇవ్వాళ జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ మరో విజయాన్ని నమోదు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో ( WPL 2026) భాగంగా ఇవ్వాళ జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ( RCB Team ) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో వరుసగా నాలుగు విజయాలు అందుకున్న బెంగళూరు జట్టు... పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించిన బెంగుళూరు జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడి 166 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు మరోసారి అద్భుతంగా రాణించింది. 18.2 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయిన బెంగుళూరు, లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో బెంగుళూరు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లో ( WPL 2026) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడి, అన్నిటిలో కూడా విజయం సాధించింది. అటు ముంబై రెండో స్థానంలో ఉండగా గుజరాత్ మూడవ స్థానంలో నిలిచింది. యూపీ, ఢిల్లీ క్యాపిటల్స్ 4, 5 స్థానంలో వరుసగా నిలిచాయి.






