IPL 2025:టీమ్ డేవిడ్ విజృంభణ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్

IPL 2025:టీమ్ డేవిడ్ విజృంభణ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab kings) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిర్ణీత 14 ఓవర్లలో... 9 వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... 95 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డేంజర్ ఆటగాడు టీమ్ డేవిడ్ ( Tim David)... భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.

26 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు టీమ్ డేవిడ్. ఇందులో మూడు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉన్నాయి. 192 తో దుమ్ము లేపాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు టీమ్ డేవిడ్. ఒకానొక సమయంలో 50 పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని బెంగళూరు ఫ్యాన్స్.. అనుకున్న నేపథ్యంలో టీమ్ డేవిడ్ ఒక్కడే ఆదుకున్నాడు. 42 పరుగుల వద్ద ఏడు వికెట్లు నష్టపోయినప్పటికీ.. ఒంటరి పోరాటం చేసి.. పంజాబ్ జట్టు ముందు మంచి లక్ష్యాన్ని ఉంచాడు. ఇక నిర్నిత 14 ఓవర్లలో 96 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుంది.

Next Story