- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB ప్లేయర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 33 రన్స్...6,6,6,6
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా... ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా... ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో... బెంగళూరు ఆటగాడు రొమారియో షెపర్డ్ ( Romario Shepherd) విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో ఏకంగా 33 పరుగులు చేసి... చెన్నైకి చుక్కలు చూపించాడు రొమారియో షెపర్డ్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్ లో ఏకంగా 33 పరుగులు బాదేశాడు ఈ RCB ఆటగాడు రొమారియో షెపర్డ్. ఈ సీజన్ లో ఒకే ఓవర్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ వెస్టిండీస్ వీరుడు రొమారియో షెపర్డ్... చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ ( Khalil Ahmed ) బౌలింగ్ లో .. వరుసగా 6,6,4,6,6NB,0,4సాధించాడు.
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో నిర్నిత 20 ఓవర్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 214 పరుగులు చేయాల్సి ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్.






