స్మృతి మంధానకు రొమాంటిక్ ప్రపోజల్.. కళ్లకు గంతలు కట్టి.. మోకాళ్లపై కూర్చుని..

by Gantepaka Srikanth |

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లిపీటలెక్కబోతోంది.

స్మృతి మంధానకు రొమాంటిక్ ప్రపోజల్.. కళ్లకు గంతలు కట్టి.. మోకాళ్లపై కూర్చుని..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లిపీటలెక్కబోతోంది. ఇటీవలే బంధువుల మధ్య గ్రాండ్‌గా నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఆమె.. నవంబర్ 23వ తేదీన వివాహం చేసుకోబోతోంది. ప్రస్తుతం ఆమెకు కాబోయే భర్త అయిన మ్యూజిక్ కంపోజర్‌ పలాష్ ముచ్చల్‌ నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆయన స్మృతి మంధానను సర్‌ప్రైజ్ చేశారు. స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి మహారాష్ట్రలోని డివై పాటిల్ స్టేడియానికి తీసుకొచ్చాడు. స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లి.. మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఆమె ఎస్ చెప్పగానే.. ఆనందంలో గట్టిగా హగ్ చేసుకొని బొకే ఇచ్చాడు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఆడి, ట్రోఫీ గెలిచింది ఇదే స్టేడియంలో కావడంతో ఇక్కడికి తీసుకొచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడని పలాష్ స్నేహితులు చెప్పుకొచ్చారు. అలాగే స్మృతి మంధానకి ఇక్కడ మంచి రికార్డు కూడా ఉంది.. దీంతో వ్యక్తిగతంగా, ఎమోషనల్‌గా నేవీ ముంబై డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంతో స్మృతి మంధానకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్ గంటల్లోనే గంటల్లోనే ఈ వీడియోకు మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. వీడియో

Next Story