బీసీసీఐ ఒత్తిడితోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడా?.. రిటైర్మెంట్‌ పాలసీపై బీసీసీఐ క్లారిటీ

by Harish |

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

బీసీసీఐ ఒత్తిడితోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడా?.. రిటైర్మెంట్‌ పాలసీపై బీసీసీఐ క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక, అతను కేవలం వన్డేలలో మాత్రమే ఆడనున్నాడు. అయితే, హిట్‌మ్యాన్ అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలకడం చర్చనీయాంశమైంది. సారథిగా తప్పుకోవాలనే ఒత్తిడి మేరకే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కొట్టిపారేశారు. రోహిత్‌పై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకరాలేదన్నారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడమేనేది అతని సొంత నిర్ణయమని చెప్పారు. ‘రోహిత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అది అతని సొంత నిర్ణయం. రిటైర్మెంట్‌ విషయంలో మా పాలసీ ఒక్కటే. ఆటగాళ్లపై మేము ఎలాంటి ఒత్తిడి చేయం. సూచనలు ఇవ్వం. వారితో ఏం కూడా చెప్పం.’ అని శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్‌కు రోహిత్ చేసిన సేవలను ప్రశంసించారు. రోహిత్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నారు. అతనో గొప్ప బ్యాట్స‌మెన్ అంటూ కొనియాడారు. రోహిత్ పూర్తిగా క్రికెట్ నుంచి రిటైర్ అవ్వలేదని, వన్డేలలో అతని అనుభవం, ప్రతిభ జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక, కొత్త టెస్టు కెప్టెన్‌పై సెలెక్టర్లే నిర్ణయం తీసుకుంటారని శుక్లా తెలిపారు.


Next Story