- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మళ్లీ ఇక్కడికి రాకపోవచ్చు’.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రోహిత్ శర్మ
సిడ్నీలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ(Rohit Sharma) షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సిడ్నీలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ(Rohit Sharma) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆస్ట్రేలియాకు రావడం, ఇక్కడ క్రికెట్ ఆడటం నాకు, కోహ్లీ(Virat Kohli)కి చాలా ఇష్టం. 2008లో ఇదే మైదానంలో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్‌ను ముగించాను. మేము మళ్లీ ఆస్ట్రేలియాకు తిరిగి వస్తామో లేదో.. ఇక్కడ వన్డేలు ఆడే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు.. కానీ ఇక్కడ ఆడటాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోము.. ఆస్ట్రేలియాలో మాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడి అభిమానుల ముందు ఆడటాన్ని ఆస్వాదిస్తాము. ఇన్నేళ్లు నాకు, కోహ్లీకి మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు’ అని రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? అనే అనుమానం అందరిలోనూ మొదలైంది. కాగా, సిడ్నీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియా, టీమిండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.






