రోహిత్ శర్మ సూపర్ సెంచరీ

by Gantepaka Srikanth |

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొడుతున్నారు.

రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగారు. మొదటి 63 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. మరో 42 బాల్స్‌లో సెంచరీ బాదేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్‌కు ఇది 50వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకు టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు సెంచరీలు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దెబ్బకు 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2, సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌కృష్ణ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిశాయి. ఒక వికెట్ నష్టపోయిన భారత్.. 225 పరుగులు చేసింది. మరో 12 పరుగులు చేస్తే విజయం ఖాయం. విజయానికి చేరువలో ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

Next Story