Rohit Sharma: కుల్దీప్ యాద‌వ్ కు క్లాస్ పీకిన రోహిత్ శ‌ర్మ

by velandi.Saikiran |

భారత్, న్యూజిలాండ్ మొదటి వన్డే సందర్భంగా కుల్దీప్ యాదవ్ కు క్లాస్ పీకాడు రోహిత్ శర్మ. ఫీల్డింగ్ సరిగ్గా చేయడం లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

Rohit Sharma: కుల్దీప్ యాద‌వ్ కు క్లాస్ పీకిన రోహిత్ శ‌ర్మ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, న్యూజిలాండ్ మొదటి వన్డే సందర్భంగా కుల్దీప్ యాదవ్ కు క్లాస్ పీకాడు రోహిత్ శర్మ. ఫీల్డింగ్ సరిగ్గా చేయడం లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్ చేస్తూ భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు కుల్దీప్ యాదవ్. కానీ అతడు ఫీల్డింగ్ లో మాత్రం చాలా వీక్. గతంలో కూడా ఈ విషయం రుజువు అయింది. అయితే, న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో కూడా కుల్దీప్ యాదవ్ ఫీల్డ్ మిస్ చేశాడు.

దీంతో వెంటనే కుల్దీప్ యాదవ్ కు క్లాస్ పీకాడు రోహిత్ శర్మ. సరిగ్గా పట్టడం నేర్చుకో అంటూ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ తమకు నచ్చిన కామెంట్స్ పెట్టి, రియాక్ట్ అవుతున్నారు. కాగా న్యూజిలాండ్ పై తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసింది భారత జట్టు. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది భారత జట్టు.

Next Story