గుడ్ న్యూస్.. శ్రీలంకతో వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ!

by velandi.Saikiran |

విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరినీ మిస్ అవుతున్న అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది.

గుడ్ న్యూస్.. శ్రీలంకతో వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ!
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరినీ మిస్ అవుతున్న అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. మరో నెల రోజుల్లోపే.. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. అతి త్వరలోనే వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. మొన్నటి వరకు బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ-ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వచ్చే నెలలో జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం... ఇద్దరు ప్లేయర్లు మరో నెల రోజులు లోపే గ్రౌండ్ లో అడుగు పెట్టబోతున్నారట. టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య... వచ్చే నెలలో కొత్త సిరీస్ నిర్వహించేందుకు రెండు బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.

ఈ రెండు జట్ల మధ్య మూడు టి20 లు, 3 వన్డే మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అది కూడా శ్రీలంకలో జరిగే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే సిరీస్ నిజమైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా మైదానంలోకి రీ-ఎంట్రీ ఇస్తారు. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టెస్టులతో పాటు టి20 లకు రిటైర్మెంట్ ఇచ్చారు. కేవలం వన్డే మ్యాచ్ లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Next Story