రోహిత్, కోహ్లీ వన్డే వరల్డ్ కప్-2027 ఆడతారా?.. గిల్ కీలక వ్యాఖ్యలు

by Harish |

భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్, కోహ్లీ వన్డే వరల్డ్ కప్-2027 ఆడతారా?.. గిల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు దిగ్గజ ప్లేయర్లు వన్డే వరల్డ్ కప్-2027 ప్రణాళికల్లో ఉన్నారని తెలిపాడు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ..‘రోహిత్, కోహ్లీ చాలా అనుభవజ్ఞులు. నైపుణ్యం కలిగిన వారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. చాలా మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించారు. వారికి ఉన్న నైపుణ్యాలు, నాణ్యత, అనుభవం ఉన్న వారు వరల్డ్‌లోనే చాలా తక్కువ మంది ఉంటారు. వారు కచ్చితంగా వన్డే వరల్డ్ కప్‌ ప్రణాళికల్లో ఉన్నారు.’అని గిల్ చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని గిల్ తెలిపాడు. స్నేహం విలువను నేర్పించాడన్నాడు. ‘రోహిత్ భాయ్ నుంచి నేను నేర్చుకున్న లక్షణాలు చాలానే ఉన్నాయి. ప్రశాంతత, సహచరులతో స్నేహంగా ఉండటం వంటి లక్షణాలు అతన్ని నుంచి నేర్చుకుంటాను.’అని గిల్ చెప్పుకొచ్చాడు.


Next Story