రోహిత్‌, కోహ్లీ ఫ్యాన్స్ అదిరిపోయే శుభ‌వార్త‌..రేపే కీల‌క ప్ర‌క‌ట‌న !

by velandi.Saikiran |

రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ ఇద్దరు క్రికెటర్లు...తిరిగి టీమిండియాలోకి రీ-ఎంట్రీ

రోహిత్‌, కోహ్లీ ఫ్యాన్స్ అదిరిపోయే శుభ‌వార్త‌..రేపే కీల‌క ప్ర‌క‌ట‌న !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు... తిరిగి టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టి20లు అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ అలాగే రోహిత్ శర్మ... ఇద్దరు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి... వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.

అనంతరం టీ20లు నిర్వహించనున్నారు. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం టీమిండియా జట్టును ప్రకటించబోతున్నారట‌ సెలక్షన్ కమిటీ సభ్యులు. అయితే ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండబోతున్నారని సమాచారం. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే కెప్టెన్ గా అవతారం ఎత్తనున్నాడు. దీంతో... రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 19వ తేదీన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ పెర్త్ వేదికగా ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న రెండో వన్డే అక్టోబర్ 25వ తేదీన మూడో వన్డే జరిగింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి టి20 సిరీస్ ప్రారంభమవుతుంది.

Next Story