రోహిత్ క్రేజ్ అంటే అది.. ప్రాక్టీస్‌కు కూడా భారీగా ఫ్యాన్స్ హాజరు

by Harish |

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ తీవ్రంగా చెమటోడుస్తున్నాడు.

రోహిత్ క్రేజ్ అంటే అది.. ప్రాక్టీస్‌కు కూడా భారీగా ఫ్యాన్స్ హాజరు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. ముంబైలోని శివాజీ పార్క్‌ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. శుక్రవారం దాదాపు రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేశాడు. కవర్ డ్రైవ్స్, స్వీప్ షాట్స్ ఆడాడు. భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అతనికి సహాయం చేస్తున్నాడు. యువ బ్యాటర్ రఘువంశీ కూడా అక్కడ ఉన్నాడు. అయితే, రోహిత్ ప్రాక్టీస్ సెషన్‌కు భారీగా అభిమానులు హాజరయ్యారు. రోహిత్ షాట్లు కొట్టినప్పుడుల్లా కేకలు వేశారు. రోహిత్ కాసేపు ఫ్యాన్స్‌తో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హిట్‌మ్యాన్ భారత్ తరపున చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఏ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. దాదాపు 8 నెలల తర్వాత టీమిండియాకు ఆడబోతున్నాడు. వన్డే కెప్టెన్‌గా అతన్ని తప్పించిన విషయం తెలిసిందే.


Next Story