- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్‌కు డెడ్‌లైన్ విధించిన బీసీసీఐ?.. ఆ టోర్నీ తర్వాత రిటైర్మెంటేనా?
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత హిట్‌మ్యాన్ టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేలు, టెస్టులు ఆడుతున్నాడు. అయితే, మునపటిలా రాణించకలేకపోవడం, కెప్టెన్‌గా విఫలమవుతున్న పరిస్థితుల్లో అతని రిటైర్మెంట్‌పై వార్తలు ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీ తర్వాత ఆ వార్తలను హిట్‌మ్యాన్ ఖండించాడు. అయితే, తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. రోహిత్‌కు బీసీసీఐ డెడ్‌లైన్ విధించినట్టు సమాచారం. ఐసీసీ టోర్నీ తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బోర్డు అతనికి సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బోర్డు అతనితో చర్చించినట్టు సదరు వర్గాలు తెలిపాయి. ‘గత సెలెక్షన్ మీటింగ్‌లో సెలెక్టర్లు రోహిత్‌తో మాట్లాడారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన ప్యూచర్ ప్లాన్‌ను డిసైడ్ చేసుకోవాలని అతనికి చెప్పారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)కు, వన్డే వరల్డ్ కప్-2027కు జట్టును సిద్ధం చేసే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ’ అని బీసీసీఐ వర్గాలు ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి కూడా డిస్కషన్ జరిగినట్టు తెలిసింది. అయితే, కోహ్లీ విషయంలో కొంతకాలం వేచిచూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించడంపై దృష్టి పెట్టారు.






