- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: ‘ది బెస్ట్ కెప్టెన్’ రోహిత్ శర్మ.. పాక్ క్రికెటర్ ప్రశంసల జల్లు
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)ని కైవసం చేసుకున్న భారత్ జట్టు (Team India)పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)ని కైవసం చేసుకున్న భారత్ జట్టు (Team India)పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏకకాలంలో అటు బ్యాటింగ్‌లోనూ అదగొట్టి.. కెప్టెన్సీలో కీలకంగా వ్యవహరించి జట్టు ట్రోఫీని సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అయినా, స్వదేశంలో రోహిత్‌ను పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐసీసీ (ICC) ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌ను దాయాది దేశ మాజీ ఆటగాడు బాసిత్ అలీ (Basit Ali) పొగడ్తలతో ముంచెత్తాడు. తన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.
అనంతరం బాసిత్ అలీ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో ఎవరు అద్భుతంగా ఆడారో వారితోనే తుది జట్టును ఎంపిక చేశానని అన్నారు. తన జట్టును ఐసీసీ (ICC) జట్టుతో కంపేర్ చేయలేనని తెలిపాడు. తన జట్టు సారథి రోహిత్ అని.. అతడు టోర్నమెంట్‌లో సరైన సమయం సరైన విధంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో అదగొట్టాడని కామెంట్ చేశారు. కాగా, బాసిత్ అలీ (Basit Ali) తన జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అందులో ఏ ఒక్క పాకిస్థాన్ (Pakistan) ప్లేయర్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బాసిత్ అలీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రచిన్ రవీంద్ర, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ శాంట్నర్, మహమ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తి.






