- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాంఖడేలో ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభం.. కన్నీరు పెట్టిన రితిక (వీడియో)
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్(Mumbai Cricket Association) ఆధ్వర్యంలో ‘రోహిత్ శర్మ స్టాండ్’ను(Rohit Sharma Stand) ఘనంగా ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ సమక్షంలో రోహిత్ తల్లిదండ్రుల చేత స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో రోహిత్ భార్య రితిక(Ritika) భావోద్వేగానికి లోనయ్యారు. భారత క్రికెట్‌కి చేసిన సేవల గుర్తింపుగా ఈ గౌరవాన్ని రోహిత్‌కు అందించారు. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ, క్రీడా నాయకులు పాల్గొన్నారు. కాగా, ఐపీఎల్‌లో రోహిత్ ముంబై తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొదట్లో చాలా తడబడ్డ రోహిత్, తిరిగి పుంజుకొని వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నారు.
అయితే ఈ వేడుకను ముందుగా మే 13న జరపాలని నిర్ణయించారు. భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగవ్వడం వల్ల ఇవాళ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి టీమిండియా ప్లేయర్లు కూడా అంతా హాజరయ్యారు.
🚨ROHIT SHARMA STAND UNVEIL🚨
— Imsajal45 (@Sajalsinha0264) May 16, 2025
The way Rohit went and took his mummy papa before his wife shows his sanskar and in last Ritika Bhabhi tears showed how special moment this is for every proud wife🥹❣️ pic.twitter.com/9P4WggzxLB






