ఇంగ్లాండ్ క్రికెట‌ర్ కు రోహిత్ శ‌ర్మ అరుదైన గిఫ్ట్

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ క్రికెట‌ర్ బ‌ట్ల‌ర్ కు రోహిత్ శ‌ర్మ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు.

ఇంగ్లాండ్ క్రికెట‌ర్ కు రోహిత్ శ‌ర్మ అరుదైన గిఫ్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం లండన్ లోనే ఉన్న రోహిత్ శర్మ... 45 జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి మరి, బట్లర్ కు అందించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బ‌ట్ల‌ర్ వెల్లడించారు. తన అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మ...ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. తాను క్రికెట్ లోకి వచ్చినప్పటి నుంచి రోహిత్ శర్మను ఆరాధిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే రోహిత్ శర్మ నుంచి ఈ జెర్సీని గిఫ్ట్ గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బట్లర్. ఇది ఇలా ఉండగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఇటీవల 3 వన్డేల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సందర్భంగా అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్..2-1 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగగా రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా నే జోస్ బ‌ట్ల‌ర్ కు ఆటోగ్రాఫ్ పెట్టిన జెర్సీని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story