కొత్త అవతారంలో రోహిత్‌ శర్మ

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-09-01 16:39:58  IST  )

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా కెప్టెన్‌గా సక్సెస్ అయిన రోహిత్ శర్మ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు.

కొత్త అవతారంలో రోహిత్‌ శర్మ
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా కెప్టెన్‌గా సక్సెస్ అయిన రోహిత్ శర్మ మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. త్వరలో 'మెగా బ్లాక్‌బస్టర్' అనే ఫన్ షూట్‌తో సినిమా రంగంలో అడుగు పెట్టనున్నాడు. గురువారం ఈ విషయాన్ని రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. 'బటర్‌ఫ్లైస్ ఇన్ మై స్టమక్.. ఏ డెబ్యూట్ ఆఫ్ ఏ కిండ్' అంటూ క్యాప్షన్ రాశాడు. అయితే ఎప్పుడూ జెర్సీలో కనిపించే రోహిత్.. ఈ సారి బ్లూ కలర్ చెక్స్ షర్ట్‌తో క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మతోపాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా బ్లాక్ బస్టర్‌లో నటించనున్నారు. అలాగే నటి రష్మికా మందన్న, హీరో కార్తీ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 4న రిలీజ్ కానుంది. కాగా, అదే రోజు ఆసియాకప్‌లో టీమ్ ఇండియా మరోసారి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది.

Next Story