- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: నేడు ఆసిస్‌తో కీలక పోరు.. వాళ్లందరికీ కెప్టెన్ రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో టీమిండియా (Team India) ఎదురులేని జట్టుగా దూసుకెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో టీమిండియా (Team India) ఎదురులేని జట్టుగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వరుసగా బంగ్లాదేశ్ (Bangladesh), పాకిస్థాన్ (Pakistan), న్యూజిలాండ్ (New Zealand)పై నెగ్గి నేడు దుబాయ్ (Dubai) వేదికగా సెమీస్‌లో ఆస్ట్రేలియా (Australia) జట్టుతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ (India) నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెట్టనుంది. ఈ క్రమంలోనే దుబాయ్‌లో ఒకే స్టేడియంలో ఆడటం భారత్‌కు కలిసి వచ్చిందంటూ పాకిస్తాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్ (Aqib Javed), దక్షిణాఫ్రికా బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ (Rassi van der Dussen), మాజీ ఇంగ్లండ్ క్రికెటర్లు నాజర్ హుస్సేన్ (Nasser Hussain), మైఖేల్ అథర్టన్ (Michael Atherton) కామెంట్ చేశారు. అయితే, ఆ విమర్శలపై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఘాటుగా స్పందించాడు.
ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్ (Dubai) తమ సొంత దేశం కాదని.. తామి ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడలేదనే విషయాన్ని గుర్తు చేశాడు. దుబాయ్ వాతావరణ దృష్ట్యా పిచ్ ఒక్కోసారి ఒక్కో విధంగా స్పిందిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి పిచ్‌లపై ఆడాలంటే సవాలుతో కూడకున్న విషయం అని అన్నారు. ప్రస్తుతం దుబాయ్ స్టేడియం (Dibai Stadium)లో మొత్తం నాలుగు పిచ్‌లు ఉన్నాయని, అందులో ఏ పిచ్‌పై సెమీస్ ఆడిస్తారో తెలియదని వివరించాడు. లోపల ట్రోఫీ గెలవాలనే సంకల్పం ఉన్నప్పుడు.. ఒత్తికి కూడా అదే స్థాయిలో ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. న్యూజిలాండ్ (New Zealand) తరహాలోనే తాము నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే అనుకుంటున్నామని, వరుణ్ చక్రవర్తి (Varun Chakraborty) అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడని హిట్‌మ్యాన్ కితాబిచ్చాడు.






