- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను బుధవారం రిలీజ్ చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతను సత్తాచాటిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్ గిల్ 4వ స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక, విరాట్ కోహ్లీ టాప్-5లోకి ప్రవేశించాడు. ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. దీంతో టాప్-5లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. ఆసిస్‌తో మూడో వన్డేలో 74 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్ సౌతాఫ్రికా, శ్రీలంక సిరీస్‌లో విఫలమవడం కోహ్లీ కలిసొచ్చింది. బాబర్ రెండు స్థానాలు కోల్పోయి 7వ ర్యాంక్‌కు పడిపోయాడు. శ్రేయస్ అయ్యర్ 9వ స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క స్థానం ఎగబాకి 6వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 8వ స్థానంలో ఉన్నాడు.జడేజా ఒక్క స్థానం కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు.






