టీ20 వరల్డ్ కప్-2026లో భారత్‌కు వాళ్లిద్దరే బలం : రోహిత్ శర్మ

by Harish |

టీ20 వరల్డ్ కప్-2026లో భారత్‌కు వాళ్లిద్దరే బలం : రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలోనే జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన బలమని భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. తాజాగా జియో స్టార్‌తో రోహిత్ మాట్లాడుతూ..‘బుమ్రా, అర్ష్‌దీప్ ఉండటం బిగ్ పాజిటివ్. బంతిని స్వింగ్ చేస్తూ త్వరగా వికెట్లు తీసే అర్ష్‌దీప్ జట్టుకు భారీ బలం. అతను కొత్త బంతితో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తాడు. ఆరంభించడం, ముగించడం చాలా కీలకం. ఆ రెండూ అతను చేయగలడు. కొత్త బంతితో అర్ష‌దీప్ లెఫ్ట్ హ్యాండర్లను స్లిప్‌లో చిక్కకునేలా స్వింగ్ చేశాడు. అదే రైట్ హ్యాండర్ల అయితే ప్యాడ్లను టార్గెట్ చేస్తాడు.’అని అర్ష్‌దీప్‌ నైపుణ్యాల గురించి చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్‌లో అతని ఫర్ఫామెన్స్‌ను గుర్తు చేశాడు. ‘ఫైనల్‌లో అద్భుతంగా రాణించాడు. బాగా బ్యాటింగ్ చేస్తున్న డికాక్‌ను అవుట్ చేశాడు. 19వ ఓవర్‌లో 2 లేదా 3 రన్సే చేసి సౌతాఫ్రికాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ ప్రపంచకప్‌లోనూ అతను భారత్ తరపున కీ రోల్ పోషిస్తాడు’అని తెలిపాడు. మరోవైపు, హార్దిక్ పాండ్యా జట్టుకు సమతుల్యతను తీసుకొస్తాడన్నాడు. బౌలర్‌గా, ఫినిషర్‌గా అతను కీలక పాత్ర పోషిస్తాడని దీమా వ్యక్తం చేశాడు.

‘5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే హార్దిక్ పాత్ర కీలకం. అతని బౌలింగ్ గురించి అందరికీ తెలుసు. కీలక సమయాల్లో బౌలింగ్ చేస్తాడు. కొత్త బంతితో, మిడిల్‌లో, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలడు. ఆరుగురు బౌలర్లతో ఆడటమే కాకుండా బ్యాటింగ్ లోతును పెంచడానికి అతను ఉపయోగపడతాడు.’అని చెప్పుకొచ్చాడు. ఇక, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలను తుది జట్టులో తీసుకోవడం కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గంభీర్‌లకు బిగ్ చాలెంజ్ అని చెప్పాడు. వాళ్లిద్దరూ ఆడాలంటే భారత్ ఇద్దరూ పేసర్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, అది సవాల్‌తో కూడుకున్నదన్నాడు. తానైతే ఇద్దరిని ఆడిస్తానని, బ్యాటర్లు వారిని అర్థం చేసుకోలేరని చెప్పాడు.


Next Story