- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాంపియన్స్ ట్రోఫీ వేటకు బయల్దేరిన భారత జట్టు.. రోహిత్, కోహ్లీతో వాళ్లు కూడా
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లు దుబాయ్‌కు బయల్దేరారు.

దిశ, స్పోర్ట్స్ : ఇటీవలే ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ వేటకు బయల్దేరింది. శనివారం భారత ఆటగాళ్లు ముంబై నుంచి దుబాయ్‌కు పయనమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఎయిర్‌పోర్టులో కనిపించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆటగాళ్ల వెంటే బయల్దేరాడు. కోచ్‌లు టి. దిలీప్, మోర్నె మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్చెట్ ఉన్నారు. ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. హైబ్రిడ్ మోడల్‌లో జరిగే ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనున్న విషయం తెలిసిందే. టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఈ నెల 20న బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనుంది. 23న పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.






