- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనికి ఎప్పుడు తగ్గాలో.. ఎప్పుడు నెగ్గాలో తెలుసు.. రోహిత్‌పై ప్రశంసలు కురిపించిన ధావన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా రోహిత్ చాలా పరిపక్వత చెందాడని, అతనికి ఎప్పుడు తగ్గాలో.. ఎప్పుడు నెగ్గాలో తెలుసునని వ్యాఖ్యానించాడు. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్ నిర్వహించిన ‘ది శిఖర్ ధావన్ ఎక్స్‌పీరియన్స్’ సిరీస్‌లో రోహిత్ నాయకత్వ నైపుణ్యాల గురించి మాట్లాడాడు. ‘రోహిత్‌కు 12 ఏళ్ల అనుభవం ఉంది. అతను చాలా కష్టాలు పడ్డాడు. ఒత్తిడిలో ఎలా పనిచేయాలో, సహచరులను ఎలా ఏకతాటిపైకి తీసుకురావాలో తెలుసు. నాయకుడిగా అతను చాలా పరిపక్వత సాధించాడు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో అతనికి తెలుసు. ఆటగాళ్లతో రోహిత్ అనుబంధం అద్భుతంగా ఉంటుంది.’ అని చెప్పాడు.
టీమిండియా తరపున రోహిత్‌తో కలిసి దాదాపు 9ఏళ్లపాటు ధావన్ ఓపెనర్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ను ప్రమోట్ చేయాలనేది అప్పటి కెప్టెన్ ధోనీ ఆలోచన అని ధావన్ చెప్పాడు.‘2013 చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ జోడీపై నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నేను కూడా కొత్త. నేను నా ప్రపంచంలో ఉన్నా. మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కానీ, రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాలని ధోనీ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్‌తో బ్యాటింగ్ ఎంజాయ్ చేయొచ్చని ఆలోచించా. ఆ మ్యాచ్‌లో మాకు మంచి శుభారంభం దక్కంది. వికెట్ కోల్పోకుండా 100 రన్స్ చేశాం. అలా మొదలైన మా జోడీ 10 ఏళ్లపాటు కలిసి ఆడతామని ఎప్పుడూ అనుకోలేదు.’అని ధావన్ వివరించాడు. టీమిండియాకు ఆడకముందే తామిద్దరం ఫ్రెండ్స్ అని, తామిద్దరం అండర్-19 వరల్డ్ కప్ ఆడామని తెలిపాడు.






