END vs IND: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-09 13:41:17  IST  )

ఒడిశాలోని కటక్ మైదానం(Cuttack Stadium) వేదికగా భారత్(Team India), ఇంగ్లండ్‌(England)లో మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొడుతున్నారు.

END vs IND: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కటక్ మైదానం(Cuttack Stadium) వేదికగా భారత్(Team India), ఇంగ్లండ్‌(England) జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అదరగొడుతున్నారు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదారు. ఇందులో నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. కాగా, చాలా కాలం తర్వాత రోహిత్ ఫామ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ శతకాలు బాదారు. చివర్లో లివింగ్‌స్టన్ (41 ) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు బ్రూక్(31), బట్లర్(34) కూడా రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 305 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇది రెండో మ్యాచ్ మాత్రమే కాదు.. నిర్ణయాత్మక మ్యాచ్ కూడా. ఇంగ్లాండ్ సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. కాబట్టి ఇది ఇంగ్లాండ్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియాకు సిరీస్ దక్కనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు మొత్తం 5 మార్పులు చేశాయి. ఇంగ్లాండ్ జట్టులో 3 మార్పులు చేయగా, భారత్ రెండు మార్పులు చేసింది.

Next Story