- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Video: మాట నిలబెట్టుకున్న రోహిత్.. ఫ్యాన్‌కు లంబోర్ఘినీ గిఫ్ట్!
రోహిత్ శర్మ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. యాడ్‌లో చెప్పినట్లే ఫ్యాన్‌కు తన ఫేవరెట్ లంబోర్ఘినీ గిఫ్ట్ ఇచ్చేశాడు!

X
దిశ, స్పోర్ట్స్: ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ లంబోర్ఘినీ ఉరుస్ కారును ఫ్యాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఐపీఎల్ 2025 సమయంలో డ్రీమ్11 ఫాంటసీ క్రికెట్ యాడ్స్‌లో రోహిత్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన ఒక యాడ్‌లో ఒక లక్కీ విన్నర్‌కు తన లంబోర్ఘినీ గిఫ్ట్‌గా ఇస్తానని రోహిత్ చెప్పాడు. అన్నమాట ప్రకారమే డ్రీమ్11 లక్కీ విన్నర్‌కు తన లంబోర్ఘినీ కారును బహుమతిగా ఇచ్చేశాడు రోహిత్. ఈ బ్లూకలర్ కారు నెంబర్ ‘ఆర్ఎస్ 264’ చాలా ప్రత్యేకమైనది.
ఇది వన్డేల్లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరును సూచిస్తుంది. శ్రీలంకపై రోహిత్ 264 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. పలుమార్లు ఇదే కారులో ముంబైలో చక్కర్లు కొడుతూ కనిపించాడు కూడా. ఇప్పుడు ఈ కారును ఫ్యాన్‌కు ఇచ్చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కారు మార్కెట్ ధర రూ.4 కోట్లు కావడం గమనార్హం.
Next Story






