Aakash Chopra: రోహిత్ శ‌ర్మ‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడించొద్దు

by velandi.Saikiran |

రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆకాశ్ చోప్రా.

Aakash Chopra: రోహిత్ శ‌ర్మ‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడించొద్దు
X

దిశ, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 మరో 14 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వచ్చే సీజన్ లో రోహిత్ శర్మను పూర్తిగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునేందుకు ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో మైదానంలో రోహిత్ శర్మ కనబడబోడన్నమాట. కేవలం బ్యాటింగ్ చేసి వెళ్లిపోతాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించారు. రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆకాశ్ చోప్రా. ఐపీఎల్ 2026 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా రోహిత్ శర్మను పూర్తిస్థాయి ప్లేయర్ గా ఆడించాలని కోరారు.

రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడని వెల్లడించారు. దానికి తోడు 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా తయారయ్యాడని గుర్తు చేశారు ఆకాశ్ చోప్రా. ఈ తరుణంలో రోహిత్ శర్మ సేవలను జట్టు వినియోగించుకోవాలని కోరాడు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే, కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ఆకాశ్ చోప్రా. గత సీజన్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ మాత్రమే చేశాడు రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ విషయంలో ఈ సీజన్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story